పీటీపీఎస్ గోల్డ్ ప్లాంట్‌లో ప్రమాదం

NTR: పీటీపీఎస్ కోల్డ్ ప్లాంట్‌లో బుధవారం ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. లైనర్ ప్లేట్ విరిగిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గత 20 రోజులుగా లైనర్ ప్లేట్ బాగో లేవని కంప్లైంట్ చేసిన అధికారులు పట్టించుకోలేదని కార్మికులు తెలిపారు. గాయాల పాలైన కార్మికులను ఆసుపత్రికి తరలించారు.