ఈసీకి సుప్రీం కీలక హెచ్చరిక

ఈసీకి సుప్రీం కీలక హెచ్చరిక

ఎన్నికల సంఘం విడుదల చేసిన బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టవిరుద్ధంగా ఉంటే 'SIR'ను రద్దు చేస్తామని, తప్పిదాలుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ అంశంపై ప్రభుత్వ, ప్రతిపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. కాగా, EC విడుదల చేసిన SIRపై ప్రతిపక్షాలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.