జిల్లా కాంగ్రెస్‌లో దుమారం.. పాత వీడియోలతో రచ్చ
NLG: జిల్లా మంత్రి కోమటిరెడ్డి సీఎంకు పంపిన లేఖ జిల్లా కాంగ్రెస్‌లో దుమారం రేపుతుంది. మంత్రి వైఖరిపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కైలాష్ నేతను డీసీసీ పదవి నుంచి తప్పించాలని కోమటిరెడ్డి లేఖ నేతల్లో అలజడి సృష్టిస్తోంది. ఇరు వర్గాలవారు తిట్ల పురాణం పాత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు.