బోధన్ ఉగ్రలింకుల కేసులో యమన్ అరెస్ట్

NZB: బోధన్‌లో యమన్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. యమన్, ఉగ్రవాది డానిష్‌తో చాటింగ్, వీడియో కాల్స్ చేసినట్లు గుర్తించారు. ఇతర దేశస్తులతో కూడా యమన్ సంభాషించినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, కృష్ణజింకను చంపిన కేసులో యమన్ తండ్రి నిందితుడిగా ఉన్నాడు.