జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి

SRD: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలను ఉద్దేశించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ పాల్గొన్నారు.