రామయ్య బ్రహ్మోత్సవాలకు గవర్నర్‌కు ఆహ్వానం
BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం ఆహ్వానించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి 27న జరిగే రామయ్య కళ్యాణం, 28న పట్టాభిషేక మహోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.