రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
W.G: లింగపాలెం మండలంలో ఇవాళ ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటించారు. దీనిలో భాగంగా, మండలంలోని పలు గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించారు. నిత్యం ట్రాఫిక్ ఉండే ఈ రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్యెల్యే సూచించారు. రోడ్డు మార్జిన్‌లను విశాలంగా, వాహనాలు పార్కింగ్ చేసుకునే విధంగా చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.