నెల్లూరు రైల్వేస్టేషన్ బుకింగ్ కౌంటర్లో అగ్నిప్రమాదం

నెల్లూరు రైల్వేస్టేషన్ బుకింగ్ కౌంటర్లో అగ్నిప్రమాదం

నెల్లూరు: నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ బుకింగ్ కౌంటర్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో సర్వర్ గదిలో మంటలు చెలరేగి వైర్లు కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. టికెట్ల జారీకి అంతరాయం కలగడంతో 4వ ప్లాట్‌ఫాం వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, మధ్యాహ్నానికి సేవలు పునరుద్ధరించారు.