ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

SKLM: రణస్థలం మండలం యాగాటి పాలెంలో జూదం శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఆదివారం జరిగిన ఈ దాడిలో 6 మందిని అరెస్టు చేసి రూ. 67,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ చిరంజీవి సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. యాగాటి పాలెంలో ఓ తోటలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందిందన్నారు.