సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
AKP: పాయకరావుపేట పట్టణం ప్రశాంతి నగర్‌లో బుధవారం సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హోం మంత్రి వంగలపూడి అనిత చొరవతో ఉపాధి హామీ పథకం ద్వారా సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షుడు వరహాల బాబు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వరహాల బాబు తెలిపారు. అలాగే, మంత్రి కృషితో పలుచోట్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు.