నియోజకవర్గానికి CMRF నిధులు మంజూరు: ఎమ్మెల్యే

నియోజకవర్గానికి CMRF నిధులు మంజూరు: ఎమ్మెల్యే

E.G: వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేవారికి CM సహాయనిధి సంజీవనిలా ఉపయోగపడుతుందని గోపాలపురం MLA మద్దిపాటి వెంకటరాజు ఆదివారం అన్నారు. నియోజకవర్గానికి CMRF కింద 17వ విడతగా రూ. 14.12 లక్షలు మంజూరయ్యాయన్నారు. వైద్యం చేయించుకోలేని అనేక మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసా కల్పిస్తుందన్నారు. ప్రజలు వీటిని వినియోగించుకోవాలని సూచించారు.