VIDEO: స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

E.G: ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక విప్లవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి పాత ఊరిలోని రజక కమ్యూనిటీ హాల్లో నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. త్వరలో కూటమి ప్రభుత్వం కుటుంబ కార్డులను పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.