VIDEO: పార్కింగ్ లారీలో మంటలు.. తప్పిన ప్రమాదం
PDPL: గోదావరిఖని పట్టణ శివారు గంగానగర్ వద్ద పార్కింగ్ చేసిన పాత లారీ మంగళవారం అగ్ని ప్రమాదానికి గురైంది. ఎండ వేడిమి కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను ఆర్పివేయడంతో భారీ ప్రమాదం తప్పింది.