కేసీఆర్ ఇంట్లో ఘనంగా దసరా వేడుకలు

కేసీఆర్ ఇంట్లో ఘనంగా దసరా వేడుకలు

SDPT: తెలంగాణ తొలి సీఎం, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రావు నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మర్కుక్ మండలం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఆయన నివాసంలో గురువారం జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ దుర్గా మాతకు పూజలు నిర్వహించారు.