బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే: డీసీసీబీ ఛైర్మన్

ADB: నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటేనని డీసీసీబీ ఛైర్మన్ అడ్డి బోజా రెడ్డి ఆరోపించారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వంపై మాజీ మంత్రి జోగురామన్న చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు.