బోడెమ్మనూరు వద్ద రాకపోకలు బంద్

NDL: ఉయ్యాలవాడ మండలం బోడెమ్మనూరు గ్రామంలో కుందూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బుదవారం రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ మేరకు బ్రిడ్జి పైకి నీరు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, కుందూ నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.