బోన్ గ్లూతో ఫ్రాక్చర్లకు చికిత్స!

ఎముకలు విరిగినప్పుడు స్టీల్ ప్లేట్లు, స్క్రూలు అమర్చే పద్ధతికి బదులుగా కేవలం 3 నిమిషాల్లో ఫ్రాక్చర్లను అతికించే 'బోన్ ఓ2' అనే గ్లూను చైనా పరిశోధకులు కనుగొన్నారు. దీనికి సంబంధించి ఓ కొత్త ఔషధాన్ని కూడా అభివృద్ధి చేశారు. ఈ గ్లూ సురక్షితమైనదని, ఎముకలను అతికించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని వారు తెలిపారు. ఇది వైద్య రంగంలో విప్లవాత్మక మార్పును తీసుకొస్తుందని పేర్కొన్నారు.