ఏబీఎన్ రాధాకృష్ణపై అమలాపురం పోలీసులకు ఫిర్యాదు
కోనసీమ: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురం వైసీపీ ఇంఛార్జి పినిపే శ్రీకాంత్ నేతృత్వంలో పట్టణ పోలీస్ స్టేషన్‌లో రాధాకృష్ణపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆయనపై కేసు నమోదు చేసి, చట్టపరంగా శిక్షించాలని కోరారు.