జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రావీణ్య ఉగాది శుభాకాంక్షలు

HNK: హనుమకొండ జిల్లా ప్రజలకు నూతన సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య తెలిపారు. తెలుగు ప్రజల పండుగలు ఉగాదితో ప్రారంభమవుతాయని, శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలు విజయవంతంగా, సంపదతో, యువత పురోగమించాలని ఆమె అన్నారు.