'విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలి'
BHNG: ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాయాలని, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష నిర్వహణను ఆయన సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.