బ్యాక్‌లాగ్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కృష్ణా: 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి బ్యాక్‌లాగ్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి M.ఫణి తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉయ్యూరులోని గిరిజన సంక్షేమశాఖ బాలుర గురుకుల పాఠశాలలో 3 నుంచి 9వ తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తులను పాఠశాలలో ఈ నెల 28వ తేదీలోగా అందజేయాలన్నారు.