తలుపుల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

తలుపుల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

సత్యసాయి: తలుపుల పోలీస్ స్టేషన్‌ను కదిరి డీఎస్పీ శివ నారాయణస్వామి గురువారం సందర్శించారు. సాధారణ తనిఖీలలో భాగంగా తలుపుల స్టేషన్‌లోని పెండింగ్ కేసుల వివరాలను, రికార్డు మెయింటెనెన్స్ తీరును ఆయన పరిశీలించారు. మండలంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని ఎస్సై చెన్నయ్యకు సూచనలు ఇచ్చారు.