ఉరిశిక్ష తీర్పుపై హసీనా స్పందన

ఉరిశిక్ష తీర్పుపై హసీనా స్పందన

అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ తనకు ఉరిశిక్షను ఖరారు చేయటంపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా స్పందించారు. ఈ తీర్పు మోసపూరితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా తమ పార్టీని పూర్తిగా బహిష్కరించాలని దురుద్దేశంతో ఈ తీర్పును ఇచ్చేలా ఒత్తిడి చేసిందని విమర్శించారు.