VIDEO: రోడ్డు వేయాలని పవన్ కళ్యాణ్ ఫోటోలతో విజ్ఞప్తి
VZM: బొండపల్లి మండలం గొల్లుపాలెం పంచాయతీ చిన్నగూడెం గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానికులు శనివారం డిమాండ్ చేశారు. గ్రామానికి విద్యుత్ సదుపాయం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రోడ్డు లేకపోవడంతో పిల్లలు బడికి వెళ్లడం, నిత్యావసరాల కోసం గ్రామం బయటకు వెళ్లడం ఇబ్బందిగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు పట్టుకుని గిరిజనులు విజ్ఞప్తి చేశారు.