తండ్రి మరణం.. దుఃఖంతో పరీక్షకు హాజరైన విద్యార్థి
KDP: జిల్లాలోని వేముల మండలం చింతజూటూరు గ్రామంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. షర్మిళ తండ్రి దస్తగిరి మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుమార్తె పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం ప్రాక్టికల్స్ పరీక్షకు పులివెందులలోని ఓ కళాశాలలో హాజరయ్యారు.