మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు..

మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు..

NRML: ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్, అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును ఇవాళ హైదరాబాద్‌లో కలసి రైతుల సమస్యలపై వినతిపత్రం అందించారు. పత్తి, సోయా ప్రభుత్వ కొనుగోలు పరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు. సోయా పంటకు ఎకరాకు 6 క్వింటాళ్ల స్థానంలో 7.6 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు పరిమితి పెంచాలని కోరారు.