జనవరిలో 9వ విడత 'పరీక్షా పే చర్చ'

జనవరిలో 9వ విడత 'పరీక్షా పే చర్చ'

ప్రధాని మోదీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించే 'పరీక్షా పే చర్చ' కార్యక్రమం 9వ విడత షెడ్యూల్‌ ఖరారైంది. 2026 జనవరిలో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించి, పరీక్షలను ఉత్సవంలా భావించేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్ధేశం. డిసెంబర్‌ 1న ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు 2026 జనవరి 11 వరకు కొనసాగుతాయి.