తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. అయ్యప్ప భక్తులు మృతి
VZM: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి శబరిమల నుంచి తిరుగు ప్రయాణమైన అయ్యప్ప భక్తులు రామేశ్వరం వద్ద రోడ్డు పక్కన కారు ఆపి నిద్రిస్తుండగా వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలవగా, నలుగురు స్పాట్‌లో మృతి చెందారు. మృతులు విజయనగరం జిల్లా దత్తిరాజేరు గ్రామాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.