రోడ్డు ప్రమాదంలో.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని జమ్మలమడుగు సర్కిల్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొలిమిగుండ్ల నుంచి ఇటిక్యాల వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఎదురుగా వస్తున్న సిమెంట్ కంటైనర్ ఢీకొనడంతో ట్రాక్టర్ నుజ్జు నుజ్జుగా మారింది. గాయపడిన వ్యక్తిని 108లో ఆసుపత్రికి తరలించారు.