శ్రీకాకుళంలో యువకుడు హత్య
SKLM: టీడీపీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి హత్యకు గురైన ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసుల వివరాలు.. మోహన్ అనే వ్యక్తి శ్రీకాకుళం పట్టణంలో గత రాత్రి హత్యకు గురయ్యాడు. అయితే, హంతకుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కాగా మోహన్ తండ్రి కూడా ఇదే కార్యాలయంలో పనిచేసేవాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.