అక్క సర్పంచ్.. తమ్ముడు ఉప సర్పంచ్
జగిత్యాల గ్రామీణ మండలం బాలపల్లి పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన గుంటి రవి సోదరి రెడ్డి రత్నది కూడా అదే ఊరు. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా రత్న.. ఆమె తమ్ముడు రవి 6వ వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అలాగే, రవి ఉపసర్పంచ్ పదవి దక్కించుకున్నారు. గ్రామాభివృద్ధి కృషిలో అక్కా,తమ్ముళ్లు కీలక పాత్ర పోషించనున్నారు.