మాజీ MLA ఓంకారం చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి
MLG: HYDలోని రవీంద్రభారతిలో మాజీ MLA మద్దికాయల ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓంకార్ చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాల వేసి నివాళులర్పించారు. ఓంకార్ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి, ప్రజా ఉద్యమాల్లో ఆరితేరినవారని కొనియాడారు. ఓంకార్ లేని లోటు తెలంగాణకు తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు.