VIDEO: వృద్ధురాలి పట్ల మానవత్వం చూపిన సీఐ
ఎన్టీఆర్: నందిగామ పోలీస్ స్టేషన్‌కు ఓ వృద్ధురాలు తన కుమారుడు త్రాగుడుకు బానిసై తన్ను ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదనతో వచ్చింది. విషయం తెలుసుకున్న సీఐ నాయుడు వెంటనే కుమారుడిని పిలిపించి కౌన్సిలింగ్ చేసి, తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. మామత్వంతో ఆమెకు అండగా నిలిచి, ఏ ఇబ్బంది వచ్చినా స్టేషన్‌ను ఆశ్రయించమని చెప్పి, వృద్ధురాలిని కుమారుడితో పంపించారు.