రేపు ములుగులో బుక్ ఎగ్జిబిషన్

రేపు ములుగులో బుక్ ఎగ్జిబిషన్

MLG: ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం బుక్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు లైబ్రేరియన్ డా.బి జగదీష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొ. కే. మల్లేశం హాజరవుతారని అన్నారు. విద్యార్థులలో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. గ్రంథ పఠనంపై ఆసక్తి గల వారు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.