ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
MDK: ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ సూచించారు. రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇవాళ ఆయన సందర్శించారు. పలు రికార్డులు తనిఖీ చేశారు. వైద్యుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. మందుల నిలువలు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.