బ్రాహ్మణచెరువులో ఉచిత వైద్య శిబిరం
W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువులో 104 వాహనం ద్వారా ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. పీహెచ్‌సీ డాక్టర్ కిరణ్మయి గ్రామంలో పర్యటించి పలు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో రామకృష్ణ, ఏఎన్ఎం లక్ష్మి పాల్గొన్నారు.