విద్యుత్ షాక్తో కార్మికుడి మృతి

కడప శివారులోని ఫాతిమా మెడికల్ కాలేజీలో కరెంట్ షాక్‌తో రామరాజు పల్లె భవన నిర్మాణ కార్మికుడు ఓబులేసు శుక్రవారం మృతి చెందాడు. ఐదు సంవత్సరాలుగా ఫాతిమా మెడికల్ కాలేజీలో భవన నిర్మాణ కార్మికుడిగా ఓబులేసు పనిచేస్తున్నాడు. ఎప్పటి లాగే ఈ రోజు కూడా వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.