గణేశ్ ఉత్సవాలపై శాంతి కమిటీ సమావేశం

RR: మోకిల పోలీస్ స్టేషన్‌లో గణేశ్ ఉత్సవాలపై శాంతి కమిటీ సమావేశం జరిగింది. సీఐ వీరబాబు గౌడ్ మాట్లాడుతూ.. ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. వినాయక విగ్రహాల ప్రతిష్ఠ అనుమతి తీసుకోవాలని, డీజే సౌండ్లతో ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని ఆయన కోరారు. ఉత్సవాలపై సీసీ కెమెరాల నిఘా ఉంటుందని తెలిపారు.