అగ్ని ప్రమాద బాధితురాలికి పరిటాల శ్రీరామ్ సాయం
సత్యసాయి: ధర్మవరంలో నివాసముంటున్న తలారి అంజలి దేవి ఇంట్లో గత రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని విలువైన వస్తువులు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ తక్షణ సాయంగా రూ 25వేల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను అందించారు. ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు.