మాట మార్చడం రాజకీయాలకు తగదు: జగ్గారెడ్డి

మాట మార్చడం రాజకీయాలకు తగదు: జగ్గారెడ్డి

SRD: రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడడం సరికాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన డిమాండ్లు చేయడం సహజమని, కానీ అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం తగదని పేర్కొన్నారు. ఏ పార్టీ అయినా ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని అన్నారు.