ఆకివీడు దేవాలయాలపై పోలీసుల ప్రత్యేక నిఘా!

ఆకివీడు దేవాలయాలపై పోలీసుల ప్రత్యేక నిఘా!

W.G: కాశీబుగ్గ దుర్ఘటన నేపథ్యంలో ఆకివీడు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్ఐ హనుమంతు నాగరాజు ఆధ్వర్యంలో పట్టణంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి? వాటిలో ఎండోమెంట్ పరిధిలో ఎన్ని, ప్రైవేటు దేవాలయాలు ఎన్ని అనే వివరాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా ప్రైవేటు దేవాలయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, భక్తుల సంఖ్య వివరాలను సేకరిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.