మహిళను ఢీ కొట్టిన బైక్
HYD: బంజారాహిల్స్ PS పరిధిలో మహిళను బైక్ ఢీకొట్టింది. బంజారాహిల్స్ రోడ్ నం.2, ఎల్వీ ప్రసాద్ మార్గ్‌లోని బ్రాడ్ వే వద్ద ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఉమా సాహును ఓ బైకర్ ఢీ కొట్టాడు. గాయాలతో అల్లాడిపోతున్న ఆమెను ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.