'మత్తు పదార్థాలతో అనర్థాలపై ప్రచారం చేయండి'

'మత్తు పదార్థాలతో అనర్థాలపై ప్రచారం చేయండి'

SRPT: కోదాడ మండల పరిధిలో నల్లబండ గూడెం గ్రామంలో రామాపురం ఎక్స్ రోడ్ నందు రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఆదివారం సాయంత్రం ప్రజలకు సందేశాలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలు ఆరోగ్యానికి హానికరమని, ప్రజలు వీటికి దూరంగా ఉండాలని కోరారు.