నరసాపురం పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవం
W.G: నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. నరసాపురం సర్కిల్ పరిధిలోని మహిళా పోలీసు సిబ్బందిని సీఐ జి.దుర్గా ప్రసాద్, ఎస్ఐ టి.వెంకట సురేష్ ఘనంగా సత్కరించారు. మహిళా సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరుస్తున్న మహిళా సిబ్బందిని అధికారుల బృందం ఘనంగా సత్కరించింది.