ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతున్న బర్నవుట్ సిండ్రోమ్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మానసిక ఒత్తిడితో బర్నవుట్ సిండ్రోమ్‌కి గురవుతున్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఒత్తిడి, మానసిక, శారీరక అలసట, భావోద్వేగాలు అదుపులో ఉండకపోవడమే బర్నవుట్ సిండ్రోమ్. నీరసంగా ఉండటం, నిద్ర రాకపోవడం, తీవ్రమైన తలనొప్పి, బలహీనంగా ఉండటం, పనిపట్ల ఆసక్తి తగ్గడం, ఆందోళన, చిన్న విషయాలకే చిరాకు పడటం, నిరుత్సాహం, బంధాలు-బంధుత్వాలకు దూరంగా ఉండటం దీని లక్షణాలు.