టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
అంధుల మహిళల T20 ప్రపంచ కప్‌ను తొలిసారి గెలుచుకున్న టీమిండియాకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఇది నిజంగా ఒక చారిత్రాత్మక విజయమని ఆయన ప్రశంసించారు. ఈ విజయం ప్లేయర్ల కృషి, దృఢ సంకల్పానికి నిదర్శనమని కొనియాడారు. ఈ ఘనత రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. అలాగే, భవిష్యత్‌లో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.