'రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి'
PDPL: రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారులు సూచించారు. మండలంలోని అందుగులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇవాళ ఏర్పాటు చేశారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు రైతులకు అందుతాయని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు అవసరమని తెలియజేశారు.