'ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

'ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

ADB: నిరుపేద ఖైదీలు డిఫెన్స్ కౌన్సిల్ ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్ అన్నారు. శనివారం జిల్లా జైల్‌ను సందర్శించారు. న్యాయాన్ని పొందే విధానాన్ని ఖైదీలకు వివరించారు. ఖైదీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అశోక్‌తో పాటు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ఉమేష్ రావు డోలే, జాధవ్ సంగీత, రూపేష్ ఉన్నారు.