VIDEO: బెల్లంకొండ జలపాతం ప్రకృతి అందాల నెలవు

PLD: బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం వద్ద ఉన్న జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కొండల మధ్య ప్రవహించే ఈ జలపాతం, చల్లని గాలులు, సువాసన వెదజల్లే చెట్లతో మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. ఇక్కడే కొండల్లో వెలిసిన సింగరయ్య స్వామి దేవాలయం భక్తులను ఆకర్షిస్తుంది. ప్రకృతి ప్రేమికులకు, ఆధ్యాత్మికతను కోరుకునే వారికి ఇది సరైన ప్రదేశం.