IPL మ్యాచ్ కోసం భారీగా తరలివస్తున్న ఫ్యాన్స్
MDCL: ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద అభిమానుల రద్దీ పెరుగుతుంది. మెట్రో స్టేడియం స్టేషన్ వద్ద ఫ్యాన్స్ సందడి నెలకొంది. జెర్సీలు ధరించి నినాదాలు చేస్తూ స్టేడియంకు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసి ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు.